Andhra Pradesh : పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-10-21 08:02 GMT

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ఏఎస్పీ పై ఆయన విమర్శలు చేశారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పనికిమాలినవాడంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఐలు, కానిస్టేబుల్స్ లేకుండా బయటకు రాలేవని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో నేరాలు తగ్గడానికి ఏఎస్పీ కారణం కాదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తాడిపత్రిలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు.

ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై...
రాళ్ల దాడి జరుగుతుంటే ఆఫీసు నుంచి బయటకు రావా? అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏఎస్పీ ఇంటి ముందు పడుకుని తాను నిరసన తెలిపినా స్పందించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఘర్షణలు కూడా ఏఎస్పీ నియంత్రించ లేకపోయారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. డీఎస్పీ చైతన్య రెడ్డి కంటే నువ్వు పనికిమాలినవాడివంటూ ఏఎస్పీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.


Tags:    

Similar News