ఏపీ నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి.. రేపు సమీర్ శర్మ పదవీవిరమణ
రేపు ప్రస్తుత సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కొత్త సీఎస్ గా ఎవరు నియమితులవుతారని
ap new cs jawahar reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు.
కాగా.. రేపు ప్రస్తుత సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కొత్త సీఎస్ గా ఎవరు నియమితులవుతారని చర్చజరుగుతోంది. నాలుగు రోజులుగా జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ప్రభుత్వం కూడా జవహర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ సీఎస్ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమీర్ శర్మ విరమణ అనంతరం.. జవహర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపడుతారు.