టాలీవుడ్ పై జనసేనాని అసహనం అందుకేనా?

Update: 2025-05-25 13:27 GMT

Janasena

తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా, కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూడా సినీ ప్రముఖులు ముందుకు రాలేదన్నారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు.


సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ 'రిటర్న్ గిఫ్ట్‌'ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందరూ కలిసి రావాలి అని తెలుగు సినీ నిర్మాతలకు పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Tags:    

Similar News