Janasena : జనసేన నుంచి ఎవరూ ఆ టాపిక్ పై మాట్లాడొద్దు

ఉప ముఖ్యమంత్రి పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దంటూ జనసేన కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది

Update: 2025-01-21 11:51 GMT

ఉప ముఖ్యమంత్రి పదవి అంశంపై ఎవరూ మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ స్పందించవద్దంటూ జనసేన కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడం, దీనికి ప్రతిగా జనసేన నేతలు కూడా ఘాటుగా రిప్లై ఇస్తుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇప్పటికే టీడీపీ...
ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మీడియా ప్రకటనలు చేయవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్డంటూ టీడీపీ కేంద్ర కార్యాలయం నిన్న హెచ్చరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్నప్పటికీ ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో జనసేన కూడా తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News