వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చిన జనసేనాని

ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​ కళ్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు

Update: 2023-08-12 09:24 GMT

ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్​ కళ్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్​కు, వాలంటీర్లకు తేడా ఏమీ లేదని పవన్​ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ ఉద్యోగానికి పోలీసు వెరిఫికేషన్ చేయాలన్నారు. కొంతమంది వాలంటీర్ల నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చాలా చోట్ల వాలంటీర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆగస్టు 12 న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల గురించి తాను ఊహించిందే జరిగిందని.. ఇళ్లల్లోకి చొరబడి ఒంటరి మహిళల గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలు అమలు చేసేందుకు సీఎం జగన్​ నియమించిన ప్రైవేటు సైన్యంగా మారారని అన్నారు. విశాఖపట్నంలో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరలక్ష్మిని చంపడానికి వారం రోజుల ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్‌గా తొలగించారని అధికారులు అంటున్నారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేష్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. జులై 24వ తేదీన వెంకటేష్ ను వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్‌గా వెంకటేష్ చేరాడు. జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్‌ హత్య చేశాడు.


Tags:    

Similar News