Pawan Kalyan : రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్ ..పొత్తులపైనే

రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ అధినాయకత్వం ఆయనకు ఆహ్వానం పంపనుంది

Update: 2024-02-10 12:48 GMT

రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ అధినాయకత్వం ఆయనకు ఆహ్వానం పలికే అవకాశం ఉంది. సోమవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నాయి. పొత్తులపై చర్చించేందుకే పవన్ కల్యాణ్ ను బీజేపీ నేతలు ఢిల్లీకి పిలుస్తున్నారు. సోమ, మంగళవారం నాడు పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశముంది.

సీట్ల సర్దుబాటుపై కూడా...
టీడీపీతో పొత్తుపై కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులపై మాత్రమే కాకుండా భవిష్యత్ లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా పవన్ తో పార్టీ పెద్దలు చర్చించనున్నారని చెబుతున్నారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News