రానని చెప్పేసిన జనసేనాని

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను

Update: 2023-12-16 11:45 GMT

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. 2023, జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర డిసెంబర్ 20తో ముగియనుంది. డిసెంబర్ 20న విశాఖపట్నం భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ సభకు తరలి వచ్చేందుకు ఏకంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటు కూడా చేశారు. దాదాపు 5 లక్షలమంది ఈ సభకు వస్తారని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు 20న వేరే కార్యక్రమాలు ఉన్నాయని కాబట్టి రాలేనని టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. టీడీపీ,జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని వెల్లడించారు.

యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేశారు. ఆ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ పాల్గొంటారు. ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. వైసీపీలోని అనేకమంది టీడీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇది యువగళంలో భాగంగానే జరుగుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మ్యానిఫెస్టో సిద్ధం కాకపోవడంతో ఈ సభకి పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదు. త్వరలో పూర్తి మ్యానిఫెస్టో సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యలో భారీ సభ నిర్వహిస్తామన్నారు అచ్చెన్నాయుడు.


Tags:    

Similar News