Pawan Kalyan : సేనాని ఇక కత్తులు దూయడమేనట...సైకిల్ తో సమానంగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ తనకు కేటాయించిన శాఖపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ ఇక పార్టీపై కూడా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు ఇకపై ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించారు. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన శ్రేణులను సిద్ధం చేసేందుకు జనసేనాని సిద్ధమవుతున్నట్లు సిద్ధమవుతుంది. ఇప్పటివరకూ గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ లపై పూర్తి స్థాయి పట్టు సాధించిన పవన్ కల్యాణ్ ఇక పార్టీని కూడా బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
షూటింగ్ లు కూడా పూర్తి కావడంతో...
పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు నుంచి అగ్రిమెంట్లు చేసుకున్న సినిమాల షూటింగ్ లు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. వచ్చే నెలలో సినిమాల నుంచి కూడా పవన్ ఫ్రీ అవుతారు. దీంతో ఆయన ఇక పార్టీపై దృష్టి పెట్టి అత్యధిక నియోజకవర్గాల్లో ఒంటరిగా బలం పెంచుకుందామని డిసైడ్ అయ్యారు. కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 175 నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలకు పెరుగుతుండటంతో జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. కనీసం ఈసారి అరవై స్థానాల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.
సెప్టంబరు నెల నుంచి...
ఇందుకోసం సెప్టంబరు నెల నుంచి పార్టీ పై ఫోకస్ పెట్టాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించకుండా సర్వే ద్వారా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్ ఛార్జులను నియమించి అక్కడ పార్టీని బలోపతేం చేసి, శ్రేణులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని పార్టీ శక్తిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. జనసేన పార్టీని విస్తృతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు జనసేనాని.
అరవై నియోజకవర్గాల్లో...
అరవై నియోజకవర్గాల్లో ఇప్పటికే పవన్ కల్యాణ్ సర్వే చేయించినట్లు తెలిసింది. అందులో యాభై నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్నట్లు తేలింది. ఆ యాభై నియోజకవర్గాల్లో కొంచెం కష్టపడితే ఖచ్చితంగా గెలవవచ్చన్న భావనతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అక్కడ సామాజికవర్గంతో పాటు యువత, అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో పాటు టీడీపీ, బీజేపీ కలిస్తే తమ గెలుపు ఖాయమని నమ్ముతున్నాు. అందుకే టీడీపీ తరహాలోనే వచ్చే సెప్టంబరు నెల నుంచి ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో యాభై నియోజకవర్గాలకు ముందుగానే ఇన్ ఛార్జులను నియమించాలని భావిస్తున్నారు. నమ్మకమైన, నీతినీజాయితీలున్న వారిని ఇన్ ఛార్జులుగా ఎంపిక చేయడంతో పాటు అక్కడ పర్యటించేందుకు కూడా పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది.