Janasena : పవన్ వింటారా? చెప్పింది చేస్తారా? తీరంలో ఏం జరగబోతోంది?

జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకే విశాఖలో మూడు రోజులపాటు విస్తృత స్థాయిసమావేశం నిర్వహిస్తున్నారు

Update: 2025-08-25 08:55 GMT

జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకే విశాఖలో మూడు రోజులపాటు విస్తృత స్థాయిసమావేశం నిర్వహిస్తున్నారు.ఆగస్ట్ 28వ తేదీ నుంచి 30వ తేదీవరకు మూడు రోజులు విస్తృత స్థాయి సమావేశం విశాఖ లో నిర్వాహిస్తున్నారు. ఈ మూడు రోజులు పాటు సేనతో సేనాని పేరిట జరిగే కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 28వ తేదీన జనసేన లెజిస్టేటివ్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేల నుంచి పవన్ కల్యాణ్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై ఎమ్మెల్యే అభిప్రాయాలను తెలుసుకుంటారు.

ఎమ్మెల్యేలతో భేటీలో...
టీడీపీ ప్రతి ఏటా నిర్వహించిన మహానాడు తరహాలో ఈ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులు తమ మాట వినడం లేదని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ తమ మాట వినకుండా టీడీపీ ఇన్ ఛార్జుల మాటకే విలువ ఇస్తున్నారని, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల తరచూ ఎమ్మెల్యేలు చెబుతుండటంతో 28వ తేదీన జరిగే లెజిస్టేటివ్ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించే అవకాశముంది. ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో తెలుసుకుని వాటిని టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా...
28వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పార్లిమెంట్ నియోజక వర్గాల వారిగా పదిమంది పార్టీ నేతలతో చర్చిస్తారు. అనంతరం పర్యావరణం , మహిళా బాధ్యత పై రక్షిత మంచినీటి పధకం, ఉపాధి క్షల్పన,మీద చర్చలు ఉంటాయి. కొత్త నాయకత్వం బయటకు వచ్చేలా ప్రోత్సహించేందుకే ఈ రకమైన సమావేశాలు అని జనసేన చెబుతుంది. విపక్షం సొషల్ మీడియా వినియోగించి చేసిన దుష్ప్రచారంపై కూడా చర్చిస్తారు. ఏడాది నుంచి అందించిన సుపరిపాలన మీద చర్చ జరుగుతుంది. ఎన్నికలు గడిచి పథ్నాలుగు నెలలు కావడంతో ఇప్పటి వరకు పార్టీ శ్రేణులతో గడిపే సమయం లేకపోవడం తో ఇప్పుడు ఈ కార్యక్రమంతో పార్టీ నాయకులు, కార్య కర్తలతో పవన్ కళ్యాణ్ కలిసి ఉంటారు.
30వ తేదీన మహాసభ...
ఈ నెల 30 వ తేదీ జనసేన మహా సభ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సభ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది.ఇప్పటికే సేనతో సేనాని కార్యక్రమ పోస్టర్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల పరిశీలించారు. క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి, కొత్త నాయకత్వాన్ని ఆహ్వానించడానికి, పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా హాజరయి క్యాడర్, ఇబ్బందులను విని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నారు.


Tags:    

Similar News