Janasena : నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్నారు
నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. పిఠాపురం సమీపంలోని చిత్రాడ సమీపంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది సభకు వస్తారని అంచనావేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో గ్రాండ్ గా జరిపేందుకు నిర్ణయించారు.
మధ్యాహ్నం నుంచి...
శుక్రవారం మధ్యమ్నం 3.30 గంటలకు మంగళగిరి నుంచి చిత్రాడకు పవన్ కల్యాణ్ రానున్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండేళ్లు కావడంతో పెద్దయెత్తున సభను, అది కూడా తనను మొన్నటి ఎన్నికల్లో ఆదరించిన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సభకు జయకేతన సభగా నామకరణం చేశారు. కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.