Janasena : పవన్ క్షమాపణలు చెప్పలేదు కానీ?

ఇటీవల పవన్ కల్యాణ్ రాజోలులో చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.

Update: 2025-12-03 03:58 GMT

ఇటీవల పవన్ కల్యాణ్ రాజోలులో చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది. కొబ్బరి చెట్లు కోనసీమలో ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగలడమేనని ఆ పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హీట్ రేకెత్తించాయి. అనేక మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నేరుగా స్పందించకపోయినా...
అయితే తనపై వస్తోన్న విమర్శలపై పవన్ కల్యాణ్ నేరుగా స్పందించలేదు. జనసేన తరుపున ఒక లేఖ విడుదల చేశారు. రైతులతో ముచ్చటిస్తూ పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని, ఇరురాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దృష్ట్యా మాటలు వక్రీకరించవద్దని జనసేన నుంచి ఒక ప్రకటన విడుదలయింది.


Tags:    

Similar News