Pawan Kalyan : మార్క్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు

Update: 2025-04-09 05:55 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. సింగపూర్ లోని స్కూలు ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కల్యాణ్ సింగపూర్ చేరుకుని మార్క్ శంకర్ ను చూశారు. వైద్యులతో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.

మరో మూడు రోజులు...
సింగపూర్ లోని ఆసుపత్రి వైద్యులు అయితే మార్క్ శంకర్ కోలుకుంటున్నారని, ఊపిరితిత్తుల వద్ద దట్టమైన పొగ పట్టడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. అలాగే నేడు ఎమెర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తున్నారు. త్వరగా కోలుకుంటున్నారని వైద్యుల తెలిపారు.


Tags:    

Similar News