Breaking : రెండు స్థానాలను ప్రకటించిన పవన్.. చంద్రబాబుకు కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు

Update: 2024-01-26 05:33 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీచీఫ్ చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే పవన్ కూడా రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. రాజోలు, రాజానగరం నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉంటారని అన్నారు. చంద్రబాబుపై నేతల నుంచి వత్తిడి ఉన్నట్లే తనపై కూడా అదే స్థాయిలో వత్తిడి ఉందని ఆయన తెలిపారు. తాను ఎందుకు రెండు సీట్లు ప్రకటించారో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని అన్నారు.

అర్థం చేసుకుంటారని...
అయితే ఆటుపోట్లు సహజమేనని, వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని పవన్ కల్యాణ‌ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగానే తాను రెండు సీట్లను ప్రకటించాల్సి వచచిందని తెలిపారు. పొత్తులో భాగంగా మూడోవంతు సీట్లను తాము తీసుకుంటున్నామని తెలిపారు.రాజాం, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. టీడీపీ కౌంటర్ గా ఆయన అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది


Tags:    

Similar News