Ys Jagan : జగన్ అంత సీరియస్ గా లేనట్లుందిగా...?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపించడం లేదు

Update: 2025-11-29 07:51 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపించడం లేదు. మరో రెండు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. జవరి లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నిలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా మాత్రం జగన్ ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఎటూ అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని భావించి వాటిని వదిలేశారా? అన్న అనుమానం వ్యక్తమవుతుంది. నిజానికి స్థానికసంస్థల ఎన్నిలకు ముందస్తు ప్రిపరేషన్ చేసుకోవాలంటే తొలుత నియోజవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలి. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీకి ఇన్ ఛార్జులు లేరు.

ఈ ఎన్నికల తర్వాత...
అంటే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్ గా లేనట్లే కనిపిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే తమ ఓటు బ్యాంకు, పార్టీ క్యాడర్ గ్రామ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో స్థిరపడుతుందని జగన్ భావిస్తున్నప్పటికీ ఇప్పటి నుంచే ఎందుకన్న ధోరణిలో జగన్ ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లాల పర్యటనలు చేయాల్సిన అవసరం లేదు. అలాగని ఊరికే కూర్చోకూడదు. ముందుగా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించడంతో పాటు లోకల్ ఎన్నికలకు సంబంధించి తన మనసులో ఉన్న మాటలను నియోజకవర్గాల ఇన్ ఛార్జులకు చెప్పాలి. అప్పుడే అభ్యర్థుల ఎంపికలో ఒక స్పష్టత ఉంటుంది.
అభ్యర్థుల ఎంపికే కీలకం...
అభ్యర్థుల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం. తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో కూర్చుని అభ్యర్థులను నిర్ణయించలేరు. అలాగని ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద క్యాడర్ బలంగా నిలబడాలంటే జగన్ స్వయంగా రంగంలోకి దిగి ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ఓటమి పాలయి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకూ అలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని పర్యటనలకు వెళుతున్నా.. జనం, క్యాడర్ భారీగానే వస్తున్నప్పటికీ వారు ఎన్నికల సమయం ఉండేవరకూ జగన్ వారితో ముఖాముఖి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులను కూడా చేపట్టకపోతే కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడటానికి కూడా రారు. జగన్ ఇప్పటికైనా మేలుకుంటే మంచిదన్న సూచనలు సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News