Andhra Pradesh : నేడు రామచంద్రాపురం నియోజకవర్గం బంద్

రామచంద్రాపురం నియోజకవర్గం నేడు బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది

Update: 2025-11-06 02:52 GMT

రామచంద్రాపురం నియోజకవర్గం నేడు బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఈ బంద్ ను నిర్వహించనుంది. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాకుండా కాకినాడ జిల్లాలో కలపాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తుంది.

కాకినాడ జిల్లాలో కలపాలని...
ఇందుకోసం జేఏసీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం త్వరలోనే జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనుండటంతో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ జేఏసీ నేడు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నియోజకవర్గం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News