Breaking : పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముంబయి నటి కేసులో విచారించేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ముంబయి నటిని వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై ఆయనపై ఫిర్యాదు అందింది. ప్రభుత్వం కూడా పీఎస్ఆర్ ఆంజనేయులును పక్కన పెట్టింది.
ముంబయి నటి కేసులో...
దీంతో ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించేందుకు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా అందాల్సి ఉంది. పీఎస్ఆర్ ఆంజనేయులు ముంబయి నటిని వేధించారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.