రఘురామ కృష్ణరాజుపై పీవీ సునీల్ కుమార్ సంచలన కామెంట్స్

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-12-20 07:17 GMT

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రఘురామకృష్ణరాజును ఆ పదవి నుంచి తొలగించాలని పరోక్షంగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన అరెస్ట్ అయితే కూటమి ప్రభుత్వం పరువు పోతుందని ఆయన ఎక్స్ లో స్పష్టం చేశారు. రఘురామ కృష్ణరాజుపై ఆయన ఏం ట్వీట్ చేశారంటే?

420 అంటే...
"420 రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కాబోతున్న సీబీఐ పెట్టిన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్. 945 కోట్లు కాజేసిన గజ దొంగ రఘురామకృష్ణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులున్నాయి. సిబిఐ కేసులో RRRకుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. సుప్రీం కోర్టు RRR ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తల వంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు. ఇలాంటి గజదొంగ ను , చీటర్ ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోవా? ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజకి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు" అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News