Breaking : శ్రీచైతన్య కళాశాలలపై ఐటీ దాడులు
శ్రీచైతన్య కళాశాలలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి
శ్రీచైతన్య కళాశాలలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం ముప్ఫయి చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. భారీ మొత్తంలో నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఆదాయపు పన్ను సోదాల్లో ఇప్పటి వరకూ పెద్దమొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ను రూపొందించి డబ్బులు వసూలుచేసినట్లు అధికారుల గుర్తించినట్లు తెలింది.
దేశ వ్యాప్తంగా 30 చోట్ల...
తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. విద్యార్థుల వద్ద ఫీజులు డబ్బుల రూపంలో తీసుకుని దానికి సంబంధించి ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసులోనే దాదాపు రెండు కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ అధికారుల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కార్టన్లలో ఉన్న నగదు మొత్తాన్ని ఇంకా ఆదాయపు పన్ను శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.