Breaking : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
IT Raids grandhi srinivas house
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పదిహేను చోట్ల ఈ తనిఖీలను బృందాలుగా విడిపోయి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను భారీగా ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
క్యాప్స్ గోల్డ్ కంపెనీలో...
హైదరాబాద్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న క్యాప్స్ గోల్డ్ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో పదిహేను ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా తప్పుడు లెక్కలను చూపుతూ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.