Train Accident : రైలు ప్రయాణమంటేనే భయం... 14 మందికి చేరిన మృతుల సంఖ్య

రైలు ప్రమాదం ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. పథ్నాలుగు మంది మరణించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Update: 2023-10-30 02:38 GMT

రైలు ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో దిగ్భ్రాంతిని కలిగించింది. పథ్నాలుగు మంది మరణించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతన్నారు. నిన్న రాత్రి విశాఖపట్నం - పలాస రైలును వెనక నించి వచ్చిన విశాఖ - రాయగడ రైలు ఢీకొట్టడంతో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జుగా మారాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. యాభై మందికి పైగా గాయపడ్డారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సిగ్నలింగ్ వ్యవస్థ...
సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఒక ట్రాక్ పైకి రెండు రైళ్లు దూసుకు రావడం అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమేనని చెబుతున్నారు. ప్రయాణికుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ రైల్వే భద్రతపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చోట రైళ్లు ఢీకొంటూనే ఉన్నాయి. దీంతో రైలు ప్రయాణమంటేనే భయమేస్తుంది. ఒక పట్టాలపైకి రెండు రైళ్లు దూసుకురావడం అనేది ఖచ్చితంగా సిగ్నలింగ్ వ్యవస్థ లోపమేనని రైల్వే శాఖకు చెందిన మాజీ అధికారులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య....
ప్రమాదం జరిగిన సమయంలో రాయగడ రైలుకు చెందిన రైలును కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైలుకు చెందిన ఏడు బోగీలు నుజ్జునుజ్జుగా మారిపోయాయి. ఒక్క పలాస - రాయగడ ప్యాసింజర్ రైలులోనే పథ్నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాద స్థలి గ్రామాలకు దూరంగా ఉండటంతో సహాయక చర్యలు కూడా ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొందరు చికిత్స సరైన సమయంలో అందక మరణించినట్లు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News