బంపర్ ఆఫర్ ...రూపాయికే బిర్యానీ
ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ అంటూ ఒక రెస్టారెంట్ యజమాని ప్రకటించారు. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు
ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ అంటూ ఒక రెస్టారెంట్ యజమాని ప్రకటించారు. దీంతో రూపాయికి చికెన్ బిర్యానీ అని జనం ఎగబడ్డారు. చాంతాడంత క్యూ కట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మొఘల్ బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆ బిర్యానీ హౌస్ యజమాని ఈ ఆఫర్‌ను ప్రకటించారు. దీంతో పెద్దయెత్తున జనం రూపాయి నోటు తీసుకుని క్యూ కట్టారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
షరతులవీ...
మార్కాపురం టౌన్‌లో పెద్దయెత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం రెస్టారెంట్ ఎదుటకు చేరుకున్నారు. అయితే పాత రూపాయి నోటు తెస్తేనే ఒక చికెన్ బిర్యానీ అంటూ షరతు పెట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకూ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొన్నారు. పాత రూపాయి నోట్లు ఇళ్లలో వెతికి మరీ తీసుకుని జనం పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రెస్టారెంట్‌ను యజమాని కాసేపటికే మూసేశారు.