Andhra Pradesh : ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థులకు అమలుచేయ తలపెట్టిన సంస్కరణలపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థులకు అమలుచేయ తలపెట్టిన సంస్కరణలపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మొదటిఇంటర్ సంవత్సరం విద్యార్థులకు యధాతధంగా పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సంస్కరణలపై అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. పబ్లిక్ పరీక్షలు యధాతధంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి కూడా నిర్వహిస్తేనే విద్యార్థుల్లో పట్టుదల పెరిగి రెండో సంవత్సరం పరీక్షలకు ప్రిపేర్ అవుతారని, సబ్జెక్ట్ పై అవగాహన పెరుగుతుందని పలువురు సూచించారు.
స్వీకరించిన అభ్యంతరాల్లో...
ఈ నెల 26 వతేదీ వరకూ స్వీకరించిన సలహాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దీంతో యధాతధంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. చదువుపై దృష్టి పెట్టాలంటే ఫస్ట్ ఇయర్ లో కూడా పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలన్న అభిప్రాయంతో ఏకీభవించింది పరీక్షల నిర్వహణకు సిద్ధమయింది. గతంలో చేసిన ప్రతిపాదనను పక్కన పెట్టింది.