తురకపాలెంలో ఎమ్మెల్యే పల్లె నిద్ర
నేడు తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం రెండో రోజు పర్యటించనుంది. ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లె నిద్ర చేశారు
నేడు తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం రెండో రోజు పర్యటించనుంది. తురకపాలెంలో వరుస మరణాలపై వివరాలను ఐసీఎంఆర్ బృందం సేకరిస్తుంది. నిన్న తురకపాలెంలో పర్యటించిన ఐసీఎంఆర్ బృందం వరస మరణాలకు గల కారణాలపై అక్కడి వైద్య అధికారులతో పాటు ప్రజలను కూడా అడిగి తెలుసుకుంది. నేడు ఐసీఎంఆర్ బృందం రెండో రోజు తురకపాలెంలో పర్యటిస్తుంది.
నేడు తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం...
ఇప్పటికే తురకపాలెంలో పర్యటించిన ఐసీఏఆర్ బృందం నిన్న మట్టి,తాగునీటి శాంపిల్స్ సేకరించింది. నిన్న తురకపాలెంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లె నిద్ర చేశారు. వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో మూఢనమ్మకాలు తొలగించేందుకు ఎమ్మెల్యే పల్లె నిద్ర చేపట్టారు. రెండు నెలల్లో ముప్ఫయి మంది మరణించడంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.