Breaking : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వతేదీ వరకూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
సిలబస్ పూర్తి చేసుకుని...
ఈ మేరకు కళాశాలల్లో సిలబస్ ను త్వరగా పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. విద్యార్థులు కూడా పరీక్షలకు ప్రణాళికబద్దంగా సిద్ధంగా కావాలని కోరింది.