నరసాపురంలో హెలికాప్టర్

సంక్రాంతి పండగకు నరసాపురం వాసులకు హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది

Update: 2026-01-13 07:45 GMT

సంక్రాంతి పండగకు నరసాపురం వాసులకు హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హెలికాప్టర్ రైడ్ సౌకర్యం కల్పించింది. స్వర్ణాంధ్ర కళాశాలలో హెలికాప్టర్ బయలుదేరి పలు ప్రదేశాలను చుట్టి వస్తుంది. హైదరాబాద్ కు చెందిన విహాగ్ సంస్థ నరసాపురంలో ఈ హెలికాప్టర్ రైడ్ సౌకర్యాన్ని కల్పించింది.

సంక్రాంతి వేళ...
సంక్రాంతి పండగ వేళ కేవలం ఐదు వేల టిక్కెట్ ధరతో ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రయాణించే వీలుంది. మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశముంది. ఈ రైడ్ ద్వారా అంతర్వేది ఆలయం, సాగరతీరం, లైట్ హౌస్, అన్నా చెల్లెళ్ల గట్టుతో పాటు కోనసీమ ప్రకృతి అందాలను చూసేందుకు, ఆకాశం నుంచి వీక్షించేందుకు ఈ రైడ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.


Tags:    

Similar News