Rain Alert : ప్రకాశంలో వర్షబీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది

Update: 2025-10-23 11:48 GMT

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. డ్రోన్ కెమెరాలతో నీటమునిగిన వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ, హెల్త్ మరియు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రాకపోకలకు సంబంధించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 18 ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు మీదుగా నీరు పొంగి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు.

అనేక ప్రాంతాల్లో నీటి మునిగి...
ఒంగోలు తాలూకా లో రెండు,సంతనూతలపాడు,మద్దిపాడు, ఎన్.జి.పాడు, టంగుటూరు,,ముండ్లమూరులలో ఒక్కొక్కటి, పామూరులో రెండు, మార్కాపురం టౌన్ , కంభం,గిద్దలూరు అర్బన్ రెండు, రాచర్ల – ఒకటి, పెద్దారవీడు రెండు,దోర్నాల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఒకటి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి రోడ్లపై ప్రవహిస్తున్న చోట్ల, ప్రజలు రాకపోకలు లేకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News