వంతెన కూలిపోయింది.. ఆ జిల్లాలకు రాకపోకలు బంద్

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు కడప జిల్లాలో తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. వంతెనలు కూలుతున్నాయి.

Update: 2021-11-21 03:52 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు కడప జిల్లాలో తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. వంతెనలు కూలుతున్నాయి. కడప జిల్లాలోని కమలాపురం వద్ద పాపాఘ్ని వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు.

నీటిలో నాని....
పాపాఘ్ని నదిపై వంతెన ఏడు మీటర్ల వరకూ కూలిపోయింది. దీంతో కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపి వేశారు. వంతెనపైకి ఎవరినీ అనుమతించడం లేదు. వెలిగల్లు జలాశయం నిండుతుండటంతో అక్కడ నాలుగు గేట్లు ఎత్తివేశారు. దీంతో నీటిలో నానిన వంతెన కూలిపోయింది. ఈ వంతెన కూలిపోవడంతో కడప - అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి.


Tags:    

Similar News