Heavy Rains : అల్లూరి జిల్లాను అతలాకుతలం చేస్తున్న వర్షం

అల్లూరి జిల్లా చింతూరులో భారీ వర్షం కురుస్తుంది. చింతూరు వద్ద ప్రమాదకరంగా శబరి నది ఉధృతి కొనసాగుతుంది.

Update: 2025-08-28 04:02 GMT

అల్లూరి జిల్లా చింతూరులో భారీ వర్షం కురుస్తుంది. చింతూరు వద్ద ప్రమాదకరంగా శబరి నది ఉధృతి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జాతీయ రహదారిపైకి...
అల్లూరి జిల్లాలోని అన్ని వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. చికటి వాగు, సోకిలేరు వాగు పొంగి పొర్లుతున్నాయి. నిమ్మలగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపేశారు. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరొకవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News