Nara Lokesh : వైసీపీకి నారా లోకేశ్ ఛాలెంజ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పై అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పై అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు చెల్లించడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం చెబుతూ ఫీజు రీఎంబర్స్ మెంట్ పై తమ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
చర్చించడానికి...
మంత్రిగా తాను అన్ని విషయాలను ప్రజలకు సభ నుంచి తెలియజేయడానికి రెడీగా ఉన్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో బకాయీలు పెట్టింది కాకుండా ఇంకా తమ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతారా? అని నిలదీశారు. బీఏసీలో చర్చించి అజెండాలో చేరిస్తే తాను ఎంతసేపయినా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఎవరి పట్ల పరుషంగా వ్యాఖ్యానించలేదని, తనకు సీనియర్లంటే గౌరవముందని నారా లోకేశ్ తెలిపారు.