వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రిజర్వ్

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ పై విచారణ ముగిసింది

Update: 2024-04-15 12:40 GMT

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ పై విచారణ ముగిసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తెలంగాణ కోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారంటూ దస్తగిరి తన పిటీషన్ లో పేర్కొన్నాడు.

దస్తగిరి పిటీషన్ పై...
అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా దస్తగిరి పిటీషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నామని సీబీఐ తరుపున న్యాయవాది కూడా తెలిపారు. అయితే ఈ పిటీషన్ పై విచారణ జరిపిన తెలంగాణ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది.


Tags:    

Similar News