ఇంటి భోజనం కావాలి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది

Update: 2025-11-18 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది. జైలులో తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు తాను నియమించుకున్న న్యాయవాదులు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. వారంలో మూడు ములాఖత్‌లు ఇవ్వాలని పిటిషన్‌ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

టేబుల్ తో పాటు...
అంతేకాకుండా తనకు ఇంటి భోజనంతో పాటు ఒక టేబుల్‌ ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటీషన్ లో తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు ఈ సౌకర్యాలను కల్పించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పిటీషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెవిరెడ్డి పిటిషన్‌ను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.


Tags:    

Similar News