Andhra Pradesh : రేపటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 3వ తేదీన తెలుగు, 4వ తేదీన ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. ఇదుకోసం ఏపీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పరీక్ష కేంద్రంలోకి సకాలంలో వస్తేనే అనుమతించనున్నారు.
పరీక్ష కేంద్రాల ఏర్పాటు...
గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో రెండు , విజయవాడలో ఆరు, తిరు పతిలో మూడు, అనంతపురంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8:30 గంటల నుంచి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రం లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని అధికారులు కోరరారు.