ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జూన్ ఒకటి నుంచి ఈ సరుకులు తక్కువ ధరకే

జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాలలోనే సరుకులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది

Update: 2025-05-28 12:00 GMT

జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాలలోనే సరుకులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, ఇతర సరుకులను పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఎండియూ వాహనాలను నిలిపేయాలని నిర్ణయించడంతో ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకులు తీసుకోవాల్సిఉంటుంది.

రేషన్ దుకాణాల్లోనే....
ఇప్పటి వరకూ బియ్యం మాత్రమే పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఇకపై పంచదారతో పాటు నూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు కూడా తక్కువ ధరకు పంపిణీచేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. దీంతో పౌర సరఫరాల శాఖ మండల కేంద్రాల నుంచి నిల్వలను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. మరోవైపు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేయనున్నారు.


Tags:    

Similar News