ప్రభుత్వానిదే పై చేయి... ఉద్యోగులది ఆరాటమే

ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గేలా లేదు. తాము అనుకున్న పద్ధతిలోనే పీఆర్సీ ని అమలు చేయాలని నిర్ణయించింది

Update: 2022-02-02 04:04 GMT

ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గేలా లేదు. తాము అనుకున్న పద్ధతిలోనే పీఆర్సీ ని అమలు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ఏ ఒక్కటి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. జీతాలు కొత్త పీఆర్సీతో పెరుగుతున్నా తగ్గుతున్నాయని ఉద్యోగ సంఘాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని భావిస్తుంది. ఉద్యోగులు తమకు పాత జీతాలే కావాలని కోరుతున్నా ఈ నెలలో కొత్త పీఆర్సీ ప్రకారమే వారి ఖాతాల్లో జీతాలను ప్రభుత్వం వేసేసింది.

పోరాట బాటలో....
ఇక మంత్రుల కమిటీతో కూడా చర్యలు సఫలం కాలేదు. ప్రభుత్వం మొండిగా ఉందని ఉద్యోగ సంఘాలు గుర్తించాయి. దీంతో తాము ముందుగా ప్రకటించుకున్న ఉద్యమ కార్యాచరణను అమలు చేసేందుకే సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాలు పెట్టిన ఏ డిమాండ్ ను పరిష్కరించేందుకు సిద్ధంగా లేదు. ఇక సమ్మెకు వెళ్లకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా అణిచివేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.


Tags:    

Similar News