తల్లికి వందనం పథకం అందకపోతే నేటి నుంచి

తల్లికి వందనం పథకం అందని అర్హులైన వారు నేటి నుంచి ఫిర్యాదులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుం

Update: 2025-06-16 02:14 GMT

తల్లికి వందనం పథకం అందని అర్హులైన వారు నేటి నుంచి ఫిర్యాదులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకానికి సంబంధించిన అన్ని అర్హతలున్నప్పటికీ రాని వాళ్లు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. అయితే ఈ పథకం ఎందుకు తిరస్కరించారో కారణం కూడా అక్కడ తెలుస్తుందని ప్రభుత్వం తెలిపింది.

అందుకు సంబంధించిన ఆధారాలు...
మీకు ఏ కారణం చేత అయితే తిరస్కరించారో అయి ఉంటదో అది కాదు అని నిరూపించుకునే ప్రూఫ్ అటాచ్ చేసి దానితోపాటు కుటుంబ సభ్యుల ఆధార్లు జత చేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇందులో మీ పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని విధిగా నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. తల్లికి వందనం నిధులు రాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.


Tags:    

Similar News