Andhra Pradesh : ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించింది.

Update: 2025-02-04 04:43 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ అధికారులతో చర్చించి దీనిపై ఈ నెల ఆరో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

మూడు వారాలు నిర్వహించాలని...
బడ్జెట్ సమావేశాలను మూడు వారాలకు పైగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడు వారాల్లో పనిదినాలు ఎన్ని అనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ నెల 6వ తేదీన బడ్జెట్ తేదీలను ప్రభుత్వం ఖరారు చేయనుందని తెలిసింది. ఈ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో సూపర్ సిక్స్ హామీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News