Andhra Pradesh : రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఆదేశాలు.. అలాగే సరుకులు ఇవ్వాలంటూ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ దుకాణ యజమానులకు స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది

Update: 2025-06-10 12:24 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ దుకాణ యజమానులకు స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. సర్వర్ సమస్య ఉంటే ఫొటో, సంతకంతో సరకులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఎక్కడైనా సర్వర్ సమస్య ఉన్నా సరకుల పంపిణీ ఆపొద్దని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సర్వర్ సమస్య ఉంటి...
ఏదైనా సమ్యలు ఉంటే లబ్ధిదారుల ఫొటో, సంతకం తీసుకుని రేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనేక చోట్ల సర్వర్ల సమస్య కారణంగా రేషన్ సరుకులు ఇవ్వడానికి డీలర్లు నిరాకరిస్తుండటంతో దుకాణానికి వెళ్లిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేయాలని చెప్పింది.


Tags:    

Similar News