Andhra Pradesh : రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వచ్చే నెల మొదటి వారంలోనే

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

Update: 2025-07-27 03:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు ప్రకటించారు. ఆగస్టు తొలి వారంలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

రైతుల సంక్షేమం కోసమే...
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్న అచ్చెన్నాయుడు, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే పీఎం కిసాన్ నిధుల కోసమే వెయిట్ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారంలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News