రఘురామ కృష్ణరాజుపై పరువు నష్టం దావా

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది.

Update: 2022-03-22 12:47 GMT

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది. ప్రబుత్వంపై ఆయన కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెబుతోంది. మద్యం శాంపిల్ప్ విషయంలో రఘురామ కృష్ణరాజు వ్యవహరించిన తీరు సరికాదని ప్రభుత్వం అభిప్రయాపడింి. పరీక్షలు చేసిన ఎస్‌జీఎస్ ల్యాబ్ ఇచ్చిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. ల్యాబ్ కు పంపిన నమూనాలు ఏపీ నుంచి సేకరించినవేనని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను పరీక్షలు చేయడానికి అనుసరించలేదని పేర్కొన్నారు.

చెన్నైలో పరీక్షలు చేయించి....
కావాలని పరీక్షలు చేయించి, ఉద్దేశ్యపూర్కకంగా చెన్నై ల్యాబ్ కు పంపడం వెనక ఆంతర్యమేంటని ప్రభుత్వం ప్రశ్నించారు. పరీక్షలు చేసిన ఎస్‌జీఎస్ ల్యాబ్ తమకు అందిన నమూనాల నుంచి రసాయనాలు ఆనవాళ్లు ఉన్నాయా? లేదా? అన్నది పరీక్షించలేదని చెప్పారు. పరీక్షలు బీఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా చేయలేదని స్పష్టం అవుతుందని రజిత్ భార్గవ తెిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News