మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.

Update: 2025-04-13 12:57 GMT

అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు.

గాయపడిన వారికి...
అయితే గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్య సాయం అందచేస్తుందని హోం మంత్రి అనిత తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతామని హోం మంత్రి అనిత తెలిపారు.


Tags:    

Similar News