Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయీలను విడుదల చేసింది. పంచాయతీ రాజ్ శాఖ, ఆర్ అండ్ బి విభాగంలో ఉన్న పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నెలకు సంబంధించిన 1,031 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ ఈ మేరకు విడుదల చేసింది.
బకాయీలను విడుదల చేస్తూ...
ప్రభుత్వ ఉద్యోగుల బకాయీలు 712 కోట్ల రూపాయలు ఉన్నాయి. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖకు చెందిన దాదాపు 319 కోట్ల రూపాయలు బకాయీలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన బకాయీలన్నింటినీ విడుదల చేయాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధుల విడుదలపై ఉత్తర్వులు జారీ చేసింది.