వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం

Update: 2025-06-24 07:27 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బదిలీలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సడలిస్తూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తమ సొంత మండలానికి బదిలీపై వెళ్లవచ్చు. అంతకు నిబంధన ప్రకారం సొంత మండలానికి బదిలీపై వెళ్ళే అవకాశం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న పట్టణంలోని ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ అయ్యేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇక సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News