ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ
good news to andhrapradesh government from central government
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసినందుకు అదనపు రుణాలు పొందేందుకు 6 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు అనుమతిని మంజూరు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కల్పించిన అవకాశంతో ఏపీ ప్రభుత్వం మరో రూ. 5,858 కోట్ల అప్పును తీసుకునే వెసులుబాటు కలిగింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రికమండేషన్‌తో రాష్ట్రాలు మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించగా.. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలకు ఈ అవకాశం లభించగా... ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే అనుమతి వచ్చింది. తాజాగా అనుమతి వచ్చిన 6 రాష్ట్రాల్లో ఏపీ, అసోం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. 2021-22లో రూ. 3716 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు 2022-23లో కేంద్రం కల్పించిన అవకాశంతో రూ. 5858 కోట్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది.