Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్.. సోలార్ రంగంలో అతి పెద్ద పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేట జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. అతి పెద్ద సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ఇక్కడకు రానుంది

Update: 2025-11-08 04:27 GMT

ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేట జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. అతి పెద్ద సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ఇక్కడకు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. దీంతో 1,700 కోట్ల భారీ పెట్టుబడికి ఆ సంస్థ సిద్ధమైంది. ఈ పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో నాలుగు గిగా వాట్ల సామర్థ్యం గల సోలార్ పీవీ టాప్ కాన్ సెల్ తయారీ యూనిట్‌ను, దానికి అనుబంధంగా ఫైవ్ గిగా వాట్స్ సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ను కూడా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ చూపడంతోనే కంపెనీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపింది.

269 ఎకరాల భూమిని...
తమ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా అతి తక్కువ సమయంలో కేటాయించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ అని మాటలకు పరిమితం కాకుండా అక్టోబర్ 2024లో చర్చలు మొదలెట్టి, ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు జరిపింది. పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పరిశ్రమ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి లభించే అవకాశముంది.
సోలార్ తయారీ కేంద్రంగా...
ఈ భారీ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ రంగంలో ముఖ్య కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతుననాయి. తొలి పెట్టుబడి రూ. 1,700 కోట్లతో పాటు, భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని ఏడు గిగా వాట్లకు పెంచడానికి మరో రూ. 502 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్ రావడంతో వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రానున్న విషయాన్ని మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.


Tags:    

Similar News