Andhra Pradesh : ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్...ధరలు భారీగా తగ్గనున్నాయ్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. మద్యం ధరలను తగ్గించడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి

Update: 2024-11-30 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. మద్యం ధరలను తగ్గించడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి.ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది.తగ్గించిన ధరలు అమల్లోకి వస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పాత ధరలతో ఉన్న వాటిని అదే ధరలకు విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన దరలతో విక్రయిస్తారని మద్యం దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులో ఉండేవి కావు. ధరలు కూడా అధికంగా ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. చీప్ లిక్కర్ ను కూడా సరఫరా చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యం కావాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా తెచ్చే వారిసంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. నాసిరకమైన మద్యం విక్రయించినందునే గత వైసీపీ ప్రభుత్వం ఓటమికి ఒక కారణంగా చెప్పాలి. మందుబాబులు అనేక మంది గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎక్కువ ధరను పెట్టి మద్యాన్ని కొనుగోలు చేసి రావడం పట్ల మద్యం ప్రియులు గత ప్రభుత్వం మీద ఓటు రూపంలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే అది ఓటమి పాలయింది. అందుకే మొన్నటి ఎన్నికల సందర్భంగా నాణ్యమైన, చౌకధరకు మద్యం విక్రయిస్తామని కూటమి నేతలు చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది.
వీటి ధరలు తగ్గి...
తాజాగా మద్యం ధరలు తగ్గడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ ధర మూడు వందలుంండగా, దీనిని 190 రూపాయలకు తగ్గించారు. హాఫ్ బాటిల్ ధర 440 రూపాయల నుంచి 380 రూపాయలకు, ఫుల్ బాటిల్ ధర 870 నుంచి 760 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వారట్టర్ 230 రూపాయల నుంచి 210 రూపాయలకు, హాఫ్ బాటిల్ ధర 920 రూపాయల నుంచి 840 రూపాయలకు తగ్గింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటల్ ధర పదహారు వందల నుంచి పథ్నాలుగు వందల రూపాయలకు తగ్గింది. మద్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం ఒక కమిటీనినియమించింది. కమిటీ ధరలను నిర్ణయించకముందే ప్రముఖ సంస్థలు తమధరలను తగ్గించుకున్నాయి. అన్ని కంపెనీలు ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తగ్గిన కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.


Tags:    

Similar News