Income tax : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. దుకాణాలన్నీ బంద్

పొద్దుటూరులో బంగారం దుకాణాలన్నీ యజమానులు మూసివేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తుండటంతో భయపడిపోయి మూసివేశారు

Update: 2023-10-22 08:26 GMT

ప్రొద్దుటూరులో బంగారం దుకాణాలన్నీ యజమానులు మూసివేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తుండటంతో భయపడిపోయి మూసివేశారు. తమ దుకాణంపై ఎక్కడ ఐటీ దాడులు జరుగుతాయోనని భయంతో స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసుకున్నారు. దసరా పండగ దినాల్లో కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నా సరే ఐటీ దాడులకు భయపడి దుకాణాలన్నింటినీ మూసివేశారని స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వెయ్యి దుకాణాలపై...
గత నాలుగు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రొద్దుటూరు బంగారం దుకాణాలకు ప్రసిద్ధి. రెండు వేల వరకూ బంగారం విక్రయించే దుకాణాలున్నాయి. నాలుగు రోజుల నుంచి వెయ్యికి పైగానే దుకాణాలపై ఐటీ రైడ్స్ జరగడంతో ఈరోజు దుకాణాలన్నీ యజమానులు మూసివేశారు. తమ నిరసనను తెలియజేస్తున్నారు.


Tags:    

Similar News