Gold Price Today : ధరల పెరుగుదల ఆగేట్లు లేవు.. ఇక బంగారాన్ని కొనలేమేమో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Update: 2025-09-04 03:46 GMT

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి మోత ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ఇప్పటికే మార్కెట్ నిపుణులు చేసిన హెచ్చరికలు నిజం అవుతున్నాయి. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా గగనంగా మారింది. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర గత కొన్ని రోజులుగా అంటే దాదాపు నెల రోజుల నుంచి లక్ష రూపాయలకు దిగి కిందకు రావడం లేదు. అందుకే బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయితే కొనుగోళ్లు మందగించినా, డిమాండ్ లేకపోయినప్పటికీ బంగారం ధరలు మరింతగా పెరగడంతో వినియోగదారులు విలవిలలాడిపోతున్నారు. ఇక దిగి వస్తాయన్న నమ్మకం లేదంటున్నారు.

గత వారం రోజుల్లో...
పది గ్రాముల బంగారం ధరపై గత వారం రోజుల్లో 5,900 రూపాయల మేరకు పెరిగింది. ఏడాది జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.78,950 కాగా, ఇప్పటి వరకు 34.35శాతం పెరుగుదలను బంగారం నమోదు చేసింది.బంగారం మాత్రమే కాదు, వెండి కూడా పరుగులు పెడుతోంది. నిన్న కిలో వెండి ధర రూ.1,37, 00కి చేరింది. ఇది వెండికి సంబంధించి అరుదైన స్థాయిగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా టారిఫ్‌లు, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుదల, గ్లోబల్ మార్కెట్‌లో బంగారానికి పెరుగుతున్న డిమాండ్, అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య ‘సురక్షిత పెట్టుబడి’గా బంగారం వైపు మదుపర్ల మొగ్గు చూపడమేనని తెలుస్తోంది.
భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇక దిగిరావని అంటున్నారు. కొనుగోలు చేసినప్పటికీ నష్టం అనేది ఉండదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,060 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,06,980 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,37,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News