గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ రాష్ఠ్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాకు గోదావరి నది ఉప్పొంగుతుంది
గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ రాష్ఠ్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాకు గోదావరి నది ఉప్పొంగుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టంగ ఉంది. కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా పెరిగే అవకాశముందని అంటున్నారు.
లోతట్టు ప్రాంతాల...
పోలవరం వద్ద 8.19మీటర్లకు గోదావరి చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు లంకగ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.