తగ్గని వరద.. పెరుగుతున్న నీరు

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి తగ్గడం లేదు. బ్యారేజీ నుంచి 25.29 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులు తున్నారు.

Update: 2022-07-16 13:20 GMT

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. బ్యారేజీ నుంచి 25.29 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులు తున్నారు. అదే స్థాయిలో ఇన్ ఫ్లో ఉంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి 28 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. సహాయక చర్యల్లో పది ఎన్డీఆర్ఎఫ్, పది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నారు.

మెడికల్ క్యాంప్ లు...
ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 324 గ్రామాలకు వరద నీరు చేరుకుంది. 76,775 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. 243 మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.


Tags:    

Similar News