నేడు అన్నవరంలో గిరిప్రదక్షణ
ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరిప్రదక్షణ జరగనుంది.
ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరిప్రదక్షణ జరగనుంది. కార్తీక మాసం కావడంతో నేడు అన్నవరం సత్యదేవుని ఆలయం చుట్టూ గిరి ప్రదక్షణ చేయడం సంప్రదాయంగా వస్తుంది. తొమ్మిది కిలోమేటర్ల మేరకు భక్తులు గిరి ప్రదక్షణ చేయనున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షణలో పాల్గొననుండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మూడు లక్షల మంది భక్తులు...
దేవాదేయ శాఖతో పాటు పోలీసులు కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు పల్లకిలో మధ్యాహ్నం సత్యరధంపై విడతలుగా గిరి ప్రదక్ణ జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షణలో దాదాపు మూడు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున భక్తులు తరలి రానుండటంతో అవసరమైన అన్ని చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు.